top of page

వ్యాసరచన పోటీలలో విద్యార్థులకు బహుమతులు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 16, 2022
  • 1 min read

వ్యాసరచన పోటీలలో విద్యార్థులకు బహుమతులు

రాజంపేట, పురపాలక పరిధిలోని స్వచ్ఛ సర్వేక్షన్ 2022 క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలలో ఇన్ఫాంట్ పాఠశాల కు చెందిన జి.విశ్వద (9 వ తరగతి ) ప్రథమ బహుమతి, మన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఈ. గీతిక ద్వితీయ బహుమతి, జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన ఎస్.జబీల తృతీయ బహుమతి సాధించారు. పట్టణ పరిధిలోని పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా పై విద్యార్థులు బహుమతులు సాధించారు. వీరికి శుక్రవారం పురపాలక కార్యాలయంలో మునిసిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి మరియు కమిషనర్ ఎం.జనార్దన్ రెడ్డిలు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సామాజిక అవగాహన కల్పించడం కోసం ఈ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రెడ్డి మాసి రమేష్ నాయుడు, మున్సిపల్ మేనేజర్ పి.శేషఫణి, శానిటరీ ఇన్స్పెక్టర్ పి.శంకర్, వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ కార్యదర్శులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page