top of page

ఎంప్లాయిస్ యూనియన్ లో వైయస్సార్ అసోసియేషన్ నాయకులు చేరిక

  • Writer: EDITOR
    EDITOR
  • May 7, 2023
  • 1 min read

ఎంప్లాయిస్ యూనియన్ లో వైయస్సార్ అసోసియేషన్ నాయకులు చేరిక

యూనియన్ లోకి ఆహ్వానిస్తున్న జీ.వి నరసయ్య

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ఆదివారం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి జీ.వీ నరసయ్య సమక్షంలో వైయస్సార్ అసోసియేషన్ కార్యదర్శి వై.సుబ్బయ్య, ఏ.డి.సి జిల్లా నాయకులు పి.ఆర్ రెడ్డి, కండక్టర్ యు.పి కొండయ్య లు ఎంప్లాయిస్ యూనియన్ లో సభ్యత్వం తీసుకున్నారు. జీవీ నరసయ్య వారికి పూలమాలవేసి సాదరంగా యూనియన్ లోకి ఆహ్వానించారు. ఎంప్లాయిస్ యూనియన్ విధివిధానాలు, సాధించిన విజయాల పట్ల ఆకర్షితులై యూనియన్ లో చేరినట్లు వారు తెలియజేశారు. సభ్యత్వం తీసుకున్న వై.సుబ్బయ్యను ఎంప్లాయిస్ యూనియన్ నందు అడిషనల్ డిపో కార్యదర్శిగా ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి జీ.వీ నరసయ్య ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో జోనల్ ఉపాధ్యక్షులు ఎం.రమణయ్య, జిల్లా ముఖ్య ఉపాధ్యక్షులు చల్లా వెంకటేష్, డిపో కార్యదర్శి బి.సి శేఖర్, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కోశాధికారి మౌలా, ముఖ్య సలహాదారులు.. సీనియర్ నాయకులు చలపతి, మ్యాథ్యూస్, చంద్రయ్య, బలరాం, రత్నం, భద్రయ్య, కృష్ణ, చిన్నోడు, పరశురాం, నారాయణ, రహమతుల్లా, నరసింహులు, షేక్ షా తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page