top of page

రైతు సమస్యలపై భారీ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వరద

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 31, 2023
  • 1 min read

రైతు సమస్యలపై భారీ ర్యాలీ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వరద

ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వరద, టిడిపి నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని రైతుల గురించి ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం వర్షాలు పడక, ముఖ్యంగా రాయలసీమలోని రైతులు వర్షాలు లేక, కాలువలకు నీరు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించే మార్గం చూపడం లేదని మాజీ ఎమ్మెల్యే వరద అన్నారు. వెంటనే రాష్ట్రంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రొద్దుటూరులో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ప్రొద్దుటూరు తాసిల్దార్ కు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ,రైతులు ,టిడిపి శ్రేణులు వినతిపత్రం సమర్పించారు.

రైతుల సమస్యలపై ఎమ్మార్వో నజీర్ అహ్మద్ కు వినతి పత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే వరద, టిడిపి నాయకులు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page