top of page

కానిస్టేబుల్ పరీక్ష నమూనా ప్రశ్నాపత్రం విడుదల

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Jan 18, 2023
1 min read

కానిస్టేబుల్ పరీక్ష నమూనా ప్రశ్నాపత్రం విడుదల - జివివి రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్ రెడ్డి, జేవివి విభాగం చక్రధర్.

పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పరీక్ష డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ లో బాగంగా ప్రొద్దుటూరులో పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పరీక్ష పేపర్స్ ను జెవివి రాష్ట్ర కార్యదర్శి తవ్వ సురేష్ రెడ్డి విడుదల చేసి అనంతరం విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పుడున్న పోటీతత్వ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రతిభ పరీక్షలు రాస్తే వారిలో ఉన్న ప్రతిభ వెలువడుతుందని, అలాగే పబ్లిక్ పరీక్ష విద్యార్థులు సులువుగా రాయవచ్చునని, విద్యార్ధులు కష్ట పడి కాకుండా ఇష్టపడి చదవాలని హితవు పలికారు.

ప్రముఖ విద్యావేత్త ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు చేత ఈ పరీక్ష పేపర్ తయారు చేపించడం జరిగింది అని అన్నారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో సృజన్, శ్రీచక్ర, పూర్ణ కోచింగ్ సెంటర్లలో పోలీస్ కానిస్టేబుల్ మోడల్ పరీక్ష జరిగింది అని అన్నారు. ఈ మోడల్ పరీక్షలు 350 మంది విద్యార్ధులు పాల్గొన్నారని, ఈ పరీక్షల నిర్వహణలో సురేంద్ర, చెన్నయ్య, శివ, రమేష్. పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page