top of page

వైభవంగా పెదమడక శ్రీమాత దుర్గ భవాని అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 31, 2022
  • 1 min read

జీవీఎంసీ 85 వ వార్డు పెద్ద మడక సూది కొండ పై వెలిసిన శ్రీ మాత దుర్గ భవాని అమ్మవారి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు బల్ల పైడ్రాజు ఆలయం ముస్తాబు చేసి అమ్మవారిని పెద్దమడక పరిసర గ్రామాల పురవీధుల్లో అమ్మవారి సారీ పళ్ళు కాయలు పసుపు కుంకుమ గాజులు స్వీట్లు తో అమ్మవారి సారీ మహిళలు కోలాటాలు ,తప్పిడి గుళ్ళు మందుగుండు సామాగ్రి తో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసి అనంతరం అమ్మవారి ఆలయంలోకి తీసుకొని వెళ్లి పూజలు నిర్వహించారు భక్తులు తీర్థప్రసాదాలు తీసుకొని అనంతరం అన్నసమారాధన ఆలయ ప్రాంగణంలో జరిగింది .

పూజా కార్యక్రమంలో ఎడిసి చైర్మన్ బలిరెడ్డి e సత్యనారాయణ స్థానిక నాయకులు మోటూరు వెంకటరమణ , గంతకోరు అప్పారావు, కొలిపాక అప్పారావు బలిరెడ్డి శ్రీను శ్రీమతి కరణం లక్ష్మి గ్రామ పెద్దలు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page