top of page

బీచ్ లో ఏడుగురు విద్యార్థుల గల్లంతు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 29, 2022
  • 1 min read

అనకాపల్లి జిల్లా పూడిమడిక బీచ్ లో ఏడుగురు విద్యార్థుల గల్లంతు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అమర్ నాథ్

పూడిమడక బీచ్ వద్ద విషాద ఘటన

సముద్రం వద్దకు వచ్చిన 15 మంది డైట్ విద్యార్థులు

అలల తాకిడితో కొట్టుకుపోయిన విద్యార్థులు

ఒకరి మృతదేహం వెలికితీత

అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. విహారానికి వచ్చిన విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్ లో సముద్ర స్నానాలకు దిగారు. అయితే అలల తాకిడికి వారిలో ఏడుగురు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page