top of page

ప్రధాన డ్రైనేజ్ పై అక్రమ కట్టడాలను తొలిగించండి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 25, 2022
  • 1 min read

ప్రధాన డ్రైనేజ్ పై అక్రమ కట్టడాలను తొలిగించండి

(ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ రాయచోటి విలేకరి)

స్పందన కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఫిర్యాదు


అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని దిబ్బల బడి వద్ద గల ప్రధాన డ్రైనేజ్ పై నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నేత మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీష కు డ్రైనేజీపై చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ప్రధాన డ్రైనేజ్ కాల్వలో హరినాథ్ వీది,కొత్తపేట చలపతి వీది, సచివాలయం వీది తదితర 6 కాల్వలు కలుస్తాయన్నారు. అయితే మాండవ్య నదిలోకి పోయే ప్రధాన డ్రైనేజ్ కాల్వపైన ఇల్లు నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.వెంటనే అక్రమ కట్టడాలను తొలిగించి వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పూసపాటి రమణ, ఐఎఫ్ టియూ నాయకులు మధు, స్థానికులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page