top of page

ఆశ్రమంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించిన ఎమ్మెల్యే కొరముట్ల అభిమానులు.

Writer: DORA SWAMY
DORA SWAMY
Jul 8, 2022
1 min read

ఆశ్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేడుకలను ఘనంగా నిర్వహించిన కొరముట్ల శ్రీనివాసులు అభిమాన సంఘం నాయకులు.



అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం రాళ్లచెరువు పల్లి వద్ద ఉన్న జీవనజ్యోతి ఆనంద నిలయం ఆశ్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు అభిమాన సంఘం నాయకులు గల్లా శ్రీనివాసులు, గల్లా నరసింహులు,గల్లా వెంకటరమణ ఆధ్వర్యంలో ఆశ్రమ నిర్వాహకులు పాణ్యం సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించబడ్డాయి.



ఈ వేడుకలలో భాగంగా ముందుగా ఆశ్రమం లోని వృద్ధులు, వికలాంగులు మధ్య కేక్ కట్ చేసి గల్లా శ్రీనివాసులు అందరికీ పంచి పెట్టారు. అనంతరం గల్లా నరసింహులు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ ఆశ్రమంలో ఇటువంటి బృహత్తకర మైన కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అయినందుకు చాలా గర్వపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.



ఈ కార్యక్రమంలో వీరితోపాటు గల్లా లక్ష్మీదేవి, గ్రందే బాలాజీ తదితరులు పాల్గొనడం జరిగింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page