top of page

పాడి పోషణతోనే బహుళ ప్రయోజనం. పశుగ్రాస వారోత్సవాల ముగింపులో కేడి ప్రసాద్

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 14, 2022
  • 1 min read

నేటితో ముగిసిన పశుగ్రాస వారోత్సవాలు

అందరి సహకారంతోనే ఇది సాధ్యమన్న.. కేడి ప్రసాద్.




రాష్ట్ర వ్యాప్తంగా 7 న ప్రారంభ మైన పశు గ్రాస వారోత్సవాలలో భాగంగా చిట్వేలి మండలంలో 7 వ తేదీ నుండి జరిగిన వివిధ కార్యక్రమాలు ఈరోజు కేకే వడ్డిపల్లి లో ముగిశాయి. ప్రభుత్వం ద్వారా మండల ఉత్తమ పాడి రైతు అవార్డు అందుకున్న పెంచలయ్య, పాడి పశువుల యాజమాన్యం గురించి, పలు సూచనలు, సలహాలు మరియు పశువుల పెంపకంలో తన అనుభవాలను గూర్చి వివరించారు.



మహిళలు గడ్డి పెంపకంలో పలు చూచనలను తోటి రైతులతో పంచుకున్నారు. కేకే వడ్డేపల్లి గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు కుంటామని దానికి ప్రభుత్వం తో పాటు జెర్సీ డైరీ కూడా తమ వంతుగా సహకరించాలని వారు కోరారు. కేకే వడ్డేపల్లి శంకర్ పాల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెర్సీ డైరీ మేనేజర్ పవన్, డీఈవో నాయక్, మహిళా పాడి రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


సామూహిక చాఫ్ కట్టర్, బ్రష్ కట్టర్ ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నిస్తామని చిట్వేలు ప్రాంతీయ పశువైద్యశాల ఏడి కేడి ప్రసాద్ రైతులకు హామీ ఇస్తూ పశుగ్రాస వారోత్సవాలను వారం రోజులపాటు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన పశుసంవర్ధక శాఖ డాక్టర్లు, సిబ్బంది, జెర్సీ డైరీ వారికి, పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా వార్తలను విరివిగా అందించిన మండల పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగినది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page