top of page

మానవత్వంతో స్పందించి వ్యక్తికి రక్తదానం చేసిన యువకుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 19, 2023
  • 1 min read

మానవత్వంతో స్పందించి వ్యక్తికి రక్తదానం చేసిన యువకుడు

రక్త దానం చేస్తున్న టి. హర్ష వర్ధన్

కడప జిల్లా, ప్రొద్దుటూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తహీనతతో బాధపడుతున్న మధు అనే వ్యక్తికి "ఓ పాజిటివ్" (O+Ve)రక్తం అవసరం కాగా వారు, పట్టణంలో డొక్కా సీతమ్మ అన్నదాన మరియు రక్తదాన సేవా సంస్థ పర్యవేక్షకుడు గంజి సురేష్ కుమార్ ను సంప్రదించారు. ఈ విషయాన్ని ప్రొద్దుటూరు మీడియా గ్రూప్స్ నందు తెలియచేయగా, విషయం తెలుసుకుని స్పందించిన టి.హర్ష వర్ధన్ అనే యువకుడు వెంటనే రక్తహీనతతో బాధపడుతున్న మధు అనే వ్యక్తికి "ఓ పాజిటివ్" గ్రూపు రక్తాన్ని రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. స్థానిక గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేసారు. స్వచ్చందంగా సహృదయంతో రక్తదానం చేసిన హర్షవర్ధన్ కు డొక్కా సీతమ్మ అన్నదాన రక్తదాన సేవా సంస్థ తరుపున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page