top of page

డొక్కా సీతమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో తిరుపతిలో రక్తదానం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 11, 2023
  • 1 min read

డొక్కా సీతమ్మ అన్నదాన,రక్తదాన సేవాసమితి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మహిళకు తిరుపతిలో రక్తదానం

కడప జిల్లా, ప్రొద్దుటూరు నందు నివాసమున్న, వి.లక్ష్మీదేవి అనే మహిళకు తిరుపతి బర్డ్స్ హాస్పిటల్ నందు మోకాలి ఆపరేషన్ కోసం అత్యవసరంగా ఏ నెగిటివ్ (A-VE) రక్తం అవసరం అవగా వారు ప్రొద్దుటూరుకు చెందిన డొక్కసీతమ్మ అన్నదాన, రక్తదాన సేవాసమితి పర్యవేక్షకుడు గంజి సురేష్ కుమార్ ను సంప్రదించగా, వెంటనే అతను అతడి స్నేహితుడు, తిరుపతి నందు మ్యాన్ కైండ్ద్ ఫార్మా కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న గురుశంకర్ కు సమాచారం అందించగా, వెంటనే ఆయన స్పందించి బర్డ్స్ హాస్పిటల్ నందు లక్ష్మీదేవి కి రక్థదానం చేసాడు. అడగ్గానే తిరుపతిలో స్పందించి రక్తదానం చేసిన గురుశంకర్ కి డొక్కా సీతమ్మ,అన్నదాన రక్తదాన సేవాసమితి వారు కృతజ్ఞతలు తెలియచేసి, ఆయన్ని అభినందించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page