top of page

ఏపీలో మందుబాబులకు శుభవార్త

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Nov 19, 2022
1 min read

ఏపీలో మందుబాబులకు శుభవార్త

ఇకపై మద్యం కొనుగోలు మరింత సులభతరం కానుంది. జేబులో డబ్బులు లేకపోయినా మద్యం షాపుకెళ్లి మందు కొనుక్కోవచ్చు. మద్యం షాపుల్లోనూ ఫోన్‌పే, గూగుల్‌పే, క్యూఆర్‌ కోడ్‌, కార్డు స్వైపింగ్‌ అందుబాటులోకి రానుంది. మద్యం షాపుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత పట్టణ ప్రాంతాల్లోని మద్యం షాపుల్లో ఈ విధానం అమలు చేయనున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే, కార్డ్‌ స్వైపింగ్‌ విధానం తీసుకురానున్నారు. ప్రతి షాపునకు ప్రత్యేక కోడ్‌ ఇస్తారు. ఏ షాపు నుంచి డిజిటల్‌ పేమెంట్‌ చేసినా అవన్నీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఖాతాకే చేరేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించబోతున్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page