top of page

రజనీకాంత్‌ కుమార్తె, అల్లుడు విడాకులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 18, 2022
  • 1 min read

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరి సంయుక్త అవగాహన మేరకు విడిపోతున్నట్లు సోమవారం రాత్రి ట్విటర్‌ ద్వారా ధనుష్‌ ప్రకటించారు. ఆయన ప్రకటించిన కొద్దిసేపటికే ఐశ్వర్య కూడా తాము విడిపోతున్న విషయాన్ని ఖరారు చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు.

18 ఏళ్లుగా స్నేహితులుగా, జంటగా కలసిమెలసి ప్రయాణించాం. ఈరోజు ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పరస్పరం అర్థం చేసుకొనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగిన వ్యక్తిగత స్వేచ్ఛను మాకివ్వండి అంటూ ధనుష్‌ ట్వీట్‌ చేశారు. ఇటీవలే సమంత, నాగచైతన్య జంట విడిపోయిన నేపథ్యంలో ధనుష్‌, ఐశ్వర్య జంట విడిపోవడంతో కోలీవుడ్‌ షాక్‌కు గురైంది. రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ధను్‌షతో 2004లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page