top of page

పసిపిల్లను చంపి ఆమె రక్తం తాగింది ఓ మహిళ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 11, 2022
  • 1 min read

పసిపిల్లను తీసుకెళ్లి చంపి ఆమె రక్తం తాగింది ఓ మహిళ.

కొన్ని ఘటనలు చూస్తే ఒ్కసారిగా ఉల్కిపడుతాం. అందులో మనిషిని చంపి రక్తం తాగేవారిని చూస్తే ఇంకేమైనా ఉందా.. జ్వరంతో రెండు మూడు రోజుల పాటు మంచం పట్టడం ఖాయం. కానీ ఏపీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకంది. ఏకంగా గుట్టపైకి పసిపిల్లను తీసుకెళ్లి చంపి ఆమె రక్తం తాగింది ఓ మహిళ. ప్రస్తుతం ఈ ఘటన ఆ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. వివరాల్లోకి వెళ్లితే.. విశాఖ జిల్లాలోని ఓ మహిళ తన భర్తతో గొడవ పెట్టుకొని విడిపోయింది. ఎంత మంది నచ్చజెప్పి భర్తతో కలిసి కాపురం చేయాలని చెప్పినా వినకుండా.. పుట్టింట్లో తమ్ముడి వద్దనే ఉంటుంది. అయితే అనారోగ్యంతో తమ్ముడు కూడా చనిపోయాడు. దీంతో అతని భార్యకు, మహిళకు ఇద్దరికీ తరచూ గొడవ జరిగేది. దాన్ని మనసులో పెట్టుకున్న మహిళ.. తమ్ముడి కూతురుని కొండపైకి తీసుకెళ్లి గొడ్డలితో అతి దారుణంగా చంపి రక్తం తాగేసింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు ఒకేసారి ఖంగుతిన్నారు. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page