top of page

ఘనంగా దానబోయిన అప్పలనాయుడు జన్మదిన వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 28, 2022
  • 1 min read

పెదగంట్యాడ, ప్రసన్న ఆంధ్ర 28-06-2022

దానబోయిన అప్పలనాయుడు జన్మదినాన్ని నడుపూరు ఎన్ వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

స్నేహశీలి మృదుస్వభావి మరియు ఆల్ ఇండియా ఆన్ రిజిస్టర్డ్ వర్కర్స్ ఎంప్లాయిస్ కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ సెక్రెటరీ, తూర్పు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు దానబోయిన అప్పలనాయుడు జన్మదినాన్ని ని నడుపూరు ఎన్ వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ మునగపాక బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అప్పలనాయుడు ఘనంగా సన్మానించి కేకును కట్ చేసి ఇ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సామాజిక సేవ ఆధ్యాత్మిక సేవ చేస్తూ పేద ప్రజలకు అండగా నిలబడి వారి బోగోగులకు ఎంతో శ్రమించిన వ్యక్తి అప్పలనాయుడని, పేద ప్రజలకు అభ్యున్నతికి కృషిచేసి ఇటు సేవారంగం అటు ఆధ్యాత్మిక చింతన చేసి అందరి మన్ననలను పొందిన మహోన్నత వ్యక్తని ఆయనకి సన్మానం చేయడం అంటే ఒక మహద్భాగ్యం అని ఆయన మన ఆయురారోగ్యాలతో ఉండి ఇ పదిమందికి సహాయం చేయాలని అన్నారు. సన్మాన గ్రహీత అప్పలనాయుడు మాట్లాడుతూ బాబు రావు గారు చెప్పినట్లు మొదటి నుండి సేవా గుణం కలిగి ఉన్నానని బడిలో పిల్లలు బడిలోనే ఉండాలని చదువుకునే పిల్లలకు చేయూతనిస్తూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం అని, అలాగే నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని 1995 లో రుణ విమోచన గణపతి శివాలయం నిర్మించి సేవలు అందిస్తున్నారని కరోనా కష్టకాలంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్ లకు క్లీనర్ లకు ప్రతిరోజు వాళ్లకు నీళ్లు అందించడం భోజనాలు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టానని స్టీల్ ప్లాంట్ లో రిటైర్ అయ్యి అందరికీ సేవ చేస్తూ ఉన్నానని నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు. అనంతరం పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్మీ గోవిందు, 62 వ వార్డు కాంగ్రెస్ నాయకులు సన్యాసిరావు, మునగపాక కృష్ణ, నర్సింగరావు, దారపు ఈశ్వరరావు, ఎం వినోద్, సావిత్రి, కరిదమ్మ, ఎం సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page