అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
- VOICE OF HERALD

- Feb 6, 2022
- 1 min read
పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, పెద్ద కోరాడ రైతు బజార్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 75 వ వార్డు టీడీపీ కార్పొరేటర్ శ్రీమతి పులి లక్ష్మీబాయి మాట్లాడాతూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్న కోటి సంతకాల మహోద్యమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీ డీ పీ నాయకులు పులి రమణ రెడ్డి వైసిపి నాయకులు పిట్ట రెడ్డి సి ఐ టి యు ఎన్ రామారావు కొవిరి అప్పలరాజు నమ్మి రమణ కనితి అప్పలరాజు పులి గుర్రప్ప బైరెడ్డి గురప్ప పాల అప్పల రెడ్డి కొండ శ్రీనివాస్ రెడ్డి సి.హెచ్ రాముడు సింహాచలం ఆనంద్ సురేష్ తదితరులు నిర్వాసితులు ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.



Comments