పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఐ ర్యాలీ
- EDITOR

- Jun 9
- 1 min read
పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఐ ర్యాలీ

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా స్థానిక పుట్టపర్తి సర్కిల్ నుండి రాజీవ్ సర్కిల్ వరకు ఆటో ర్యాలీని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పి సుబ్బరాయుడు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ సర్కార్ ట్రంప్ కు భారత దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పర్యవసానంగా ఇవాళ భారతదేశంలో వీటి కొరత ఏర్పడిందన్నారు. కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మోడీని ప్రశ్నించకుండా బానిసత్వాన్ని చాటుతున్నారని వారు దుయ్యబట్టారు. ఒక్క రోజులోనే అమాంతం గ్యాస్ పైన 29 రూపాయలు పెంచినటువంటి రాష్ట కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కాదా అని వారు ప్రశ్నించారు?
రాష్ట్రంలోని గోదారి బేసిన్లో 50% గ్యాస్ నిక్షేపాలు రాష్ట్ర ప్రయోజనాలకు వాడాలని రిలయన్స్ కు నిబంధనలు విధించాలని సిపిఐ గా ప్రశ్నిస్తుంటే అందుకు భిన్నంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో గ్యాస్ నిక్షేపాలు ఎక్కడున్నాయని అవగాహన రాహిత్యంగా మాట్లాడడం విడ్డూరమన్నారు. తక్షణం కేంద్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్కు నుండి బయటపడాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 36% పన్నులు పెంచుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సుపరిపాలన ఏ రకంగా అవుతుందని వారు ధ్వజమెత్తారు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలపై భారాన్ని తగ్గించాలని లేని పక్షాన రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆటోలకు తాళ్లు కట్టి గ్యాస్ బండ నెత్తిన పెట్టుకొని మహిళలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఐ సమితి సభ్యులు వై హరి, మచ్చా శ్రీను, దేవరశెట్టి నరసింహ, మద్దిలేటి ప్రమీల, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి పీటర్, ఉప ప్రధాన కార్యదర్శి తౌసిఫ్ తదితరులు పాల్గొన్నారు.



Comments