top of page

ప్రధాన డ్రైనేజ్ అక్రమ కట్టడాలను తొలిగించాలని సి.పి.ఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఆద్వర్యంలో ధర్నా

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 13, 2022
  • 1 min read

ప్రధాన డ్రైనేజ్ అక్రమ కట్టడాలను తొలిగించాలని సి పి ఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఆద్వర్యంలో ధర్నా.

(అన్నమయ్య జిల్లా) రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో ప్రధాన డ్రైనేజ్ పై అక్రమ కట్టడాలను తొలిగించాలని బుధవారం రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట సి పి ఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆద్వర్యంలో ధర్నా జరిగింది ఈ సందర్భంగా సి పి ఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మావులూరి విశ్వనాథ్ మాట్లాడుతు,

పట్టణ పరిదిలొ కొత్త పేట ప్రాథమిక పాఠశాల దిబ్బల బడి మాండవ్య నది లోకి పోయే ప్రధాన కాలువ పై అక్రమ నిర్మించిన కట్టడాలను తొలిగించఢంతో పాటు నిర్మాణాలు చేపట్టినా వారిపై కేసులు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఇవే కాకుండా చాలా ఆక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయి అన్నారు. దిబ్బల బడి కి ఎదురుగా ఉన్న మాండవ్య నది లోకి పోయే కాల్వ లొ దాదాపు ఆరు డ్రైనేజ్ కాల్వలు కలుస్తాయి అన్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ రాంబాబు గారి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది అన్నారు కమీషనర్ ‌రాంబాబు వెంటనే స్పందించి కచ్చితంగా అక్రమ కట్టడాలు చేపట్టిన వారి పైన చర్యలు తీసుకుంటామని అక్రమ కట్టడాలను తొలిగించుతామని ఆయన తెలిపారు అన్నారు ఈ కార్యక్రమంలో సి పి ఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పూసపాటి రమణ స్థానికులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page