top of page

ప్లాన్ అప్రూవల్ టిడిపి హయాంలో ఇచ్చారు - కౌన్సిలర్ గరిశపాటి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 24, 2024
  • 1 min read

ప్లాన్ అప్రూవల్ టిడిపి హయాంలో ఇచ్చారు - కౌన్సిలర్ గరిశపాటి

మాట్లాడుతున్న కౌన్సిలర్ గరిశపాటి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణ సూపర్ బజార్ రోడ్డు మొదలులో నూతనంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని అందుకు మున్సిపల్ ఏసిపి మునిరత్నంని బాధ్యున్ని చేస్తూ ప్రొద్దుటూరు టిడిపి సీనియర్ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి శనివారం ఉదయం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు గుప్పించగా, అందుకు సమాధానంగా వైసిపి కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి ముందుగా ప్లాన్ అప్రూవల్ ఏ సంవత్సరంలో ఇచ్చారో టిడిపి నాయకులు తెలుసుకోవాలని, నాటి టిడిపి ప్రభుత్వం మే నెల 2018వ సంవత్సరంలో అప్పటి మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి హయాంలో ఈ బహుళ అంతస్తు భవనానికి పర్మిషన్ ఇచ్చారని అన్నారు. వైసిపి నాయకులు కౌన్సిలర్ల పై గడచిన కొద్దికాలంగా టిడిపి నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయవలసిందిగా ఆమె హితువు పలికారు. సమావేశంలో కౌన్సిలర్ పాతకోట వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page