top of page

త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వైసిపి కౌన్సిలర్లు దీక్షలు ప్రారంభం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 13, 2022
  • 1 min read

Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365


త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వైసిపి కౌన్సిలర్లు దీక్షలు ప్రారంభం


సామర్లకోట పట్టణంలో మునిసిపల్ అధికారులు పట్టణ ప్రజలకు శుద్ధిచేసిన. త్రాగునీటిని సరఫరా చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపిస్తూ అధికార పక్షం, వైసీపీ పార్టీకి చెందిన ఇద్దరుకౌన్సిలర్లు పితాని కృష్ణ, కరణం రాజ్ కుమార్ లు సోమవారం ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. త్రాగునీటి సమస్యపై తాము దీక్షలు చేస్తామని రెండు రోజుల క్రితమే కృష్ణ ప్రకటించిన విషయం విదితమే.

పార్టీలోనే అన్ని వర్గాలూ ఆమరణ నిరాహార దీక్షలను. విరమింపజేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఒక దశలో మునిసిపల్ అధికారులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ముందుగా ప్రకటించిన మేరకు కాకుండా స్టేషన్ సెంటర్ రింగ్ సెంటర్ వద్ద కౌన్సిలర్లు ఈ ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. పలు పార్టీల నాయకులు వీరి దీక్షలకు మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిసింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page