top of page

ప్రజా సమస్యలను తీరుస్తున్న కార్పొరేటర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 31, 2022
  • 1 min read

ప్రసన్న ఆంధ్ర పెదగంట్యాడ ప్రతినిధి, 64 వ వార్డు, గొడ్డువాని పాలెం గ్రామం K.గోవిందరావు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కొన్ని నెలల నుండి మంచి నీళ్ల బోరు పని చేయటం లేదని, స్థానికులు నీటి సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారని, 64వ వార్డు శ్రీ దల్లి గోవిందరెడ్డి కి ఫిర్యాదు చేశారు. సమస్య చెప్పిన వెంటనే కార్పొరేటర్ స్పందిస్తూ మంచినీళ్లు బోరు కు కావలసిన సామాగ్రిని తక్షణమే రప్పించి జివిఎంసి వారితో మంచినీళ్లు బోరు బాగు చేయించారు. స్థానిక మహిళలు సంతోషం వ్యక్తం చేశారు, కార్పొరేటర్ గోవిందరెడ్డి ఆ స్థలానికి చేరుకొని స్థానిక సమస్యలు మహిళల ద్వారా సామరస్యంగా తెలుసుకొని, వారితో సమస్యల పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో గోవింద రావు, రమణ, వంశీ, లోహిత్, శివ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంటు అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య మహిళలు, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page