top of page

కోపరేటివ్ కన్జ్యూమర్ స్టోర్స్ కు ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 13, 2023
  • 1 min read

కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ స్టోర్స్ కు ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం, అధ్యక్షులుగా గజ్జల కళావతి ప్రమాణం


ప్రొద్దుటూరు పట్టణంలోని ది ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ స్టోర్స్ లిమిటెడ్ కు 12 మందితో కూడిన నూతన పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఎన్నికల అధికారిచేత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సతీమణి రాచమల్లు రమాదేవి మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి సమక్షంలో అధ్యక్షురాలుగా గజ్జల కళావతి, ఉపాధ్యక్షులుగా హనుమాన్ వీవర్స్ కోఆపరేటివ్ సంస్థకు చెందిన వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం నూతన పాలకవర్గ సభ్యులుగా నల్లబోతుల సుబ్బరాయుడు, వి శివశంకర్ రెడ్డి, వెళ్లాల వినోద్ కుమార్ రెడ్డి, సి రంగనాయకులు, పాము గారి సురేంద్రనాథ్ రెడ్డి, లక్ష్మీ రంగారెడ్డి, మదన్ కుమార్, మహమ్మద్ షబ్బీర్, ఎన్ శ్రీరాములు, ఉదయలక్ష్మి హనుమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గజ్జల కళావతి మాట్లాడుతూ కన్జ్యూమర్ స్టోర్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు నాపై నమ్మకంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ పాతకోట బంగారు ముని రెడ్డిలు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగశేషారెడ్డి మండలాధ్యక్షులు సానబోయిన శేఖర్ యాదవ్ కౌన్సిలర్లు వరకూటి ఓబులరెడ్డి, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, కమల్ భాష హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు ద్వార్శల భాస్కర్ రెడ్డి వైసిపి నాయకులు బండారు సూర్యనారాయణ రాగా నరసింహారావు మీగడ చంద్రశేఖర్ రెడ్డి ద్వార్శల గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page