top of page

CMRF చెక్కుల పంపిణీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 24, 2022
  • 1 min read

ఎమ్మెల్యే రాచమల్లు CMRF చెక్కుల పంపిణీ

గురువారం ఉదయం ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజవర్గంలో వివిధ అనారోగ్యాల సమస్యలతో కార్పొరేట్ హాస్పిటల్ నందు వైద్యం పొందిన లబ్ధిదారులకు సీఎం  సహాయ నిధి చెక్కులు పంపిణీలో భాగంగా నేడు 26,80,000 రూపాయలు ఎనిమిది మంది లబ్ధిదారులకు అందించామని, టిడిపి హయాంలో పది శాతం మాత్రమే ప్రజలకు లబ్ధి చేకూరిందని, కాగా వైసీపీ హయాంలో తొంబై శాతం మంది లబ్ధి పొందుతున్నారని, ఇప్పటికి ప్రొద్దుటూరులో దాదాపు అయిదు కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశామని గుర్తుచేశారు.

సహాయ నిధి పొందినవారిలో నీలు రూ. 10,20,000, శివ శంకర్ రెడ్డి రూ. 4,50,000, సుబ్బారెడ్డి 3,50,000, జయ లక్ష్మీ రూ. 2,80,000, రవీంద్ర రెడ్డి రూ. 2,50,000, పొన్న లక్ష్మీ దేవి రూ. 1,00,000, హైమావతి రూ  1,00,000, లలిత చింతా రూ. 70,000 అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా  ప్రజలకు ఆర్థిక భారం నుండి ఉపశమనం కలుగుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో  భీమునిపల్లి  లక్ష్మీదేవి నాగరాజు, మునిసిపల్ కమిషనర్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page