top of page

నిజాయితీకి సంకెళ్లు వేశారు - సీఎం సురేష్ నాయుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 22, 2023
  • 1 min read

నిజాయితీకి సంకెళ్లు వేశారు - సీఎం సురేష్ నాయుడు

రిలే నిరాహార దీక్షలో సురేష్ నాయుడు వర్గం

కడప జిల్లా, ప్రొద్దుటూరు


టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సీఎం సురేష్ నాయుడు వర్గం రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం పాఠకులకు వివిధమే. అయితే బాబు అరెస్టును నిరసిస్తూ తాము చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ప్రజల మద్దతు రోజు రోజుకు పెరుగుతోందని, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన బాబును అరెస్టు చేయటంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని అన్నారు. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి వైసిపి పైశాచిక ఆనందం పొందుతోందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెబుతారని, ఇప్పటికి బాబుపై మరిన్ని అక్రమ కేసులు బనాయించాలని వైసీపీ చూస్తోందని సీఎం సురేష్ నాయుడు అన్నారు.

అనంతరం తెలుగు యువత కడప జిల్లా అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ నిజాయితీకి సంకెళ్లు వేశారని, మంత్రి రోజా వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మహిళలు సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి రోజా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అన్నారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page