top of page

సీఎం జగన్ పర్యటన భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్.పి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 1, 2022
  • 1 min read

తిరుపతి జిల్లా, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కట్టు దిట్టమైన బారీ భద్రత. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా యస్.పి. శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి ఐపియస్.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన సందర్భంగా.. రేణిగుంట విమానాశ్రయం నుంచి పర్యటన ప్రాంతాలన్నీ ఈరొజు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విమానాశ్రయం, టాటా క్యాన్సర్ హాస్పిటల్, తారకరామా స్టేడియంల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు శాఖ.


బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా యస్.పి శ్రీ. పి. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ ఏర్పాట్లను పరిశీలించి ముందస్తు భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులకు సూచించారు.


ట్రాఫిక్ నియంత్రణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు


ఈ కార్యక్రమంలోఎల్.అండ్.ఓ అడిషినల్ యస్.పి అరిపుళ్ళా, ఎస్బి డిఎస్పీ రమణ, డీఎస్పీలు ఈస్ట్ మురళి కృష్ణ, వెస్ట్ నారసప్ప, ట్రాఫిక్, విజయ శేఖర్, సిఐ లు పాల్గొన్నారు..

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page