top of page

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 5, 2022
  • 1 min read

పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు
పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు & అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మద్యం దుకాణాల సూపర్వైజర్లు, సేల్స్ మెన్, డిపో స్టాఫ్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియచేస్తూ, స్థానిక ఏం.ఆర్.ఓ కార్యాలయం నుండి మైదుకూరు రోడ్డులోని దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ఆయన చిత్రపటాన్ని ఊరేగించి, రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొని మద్యం దుకాణాల ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియచేసారు. ఉద్యోగులు రాచమల్లుకు పూలమాల వేసి శాలువాతో సన్మానిచారు, అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ వైన్ షాపులో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లకు 4000, సేల్స్ మేన్స్ కు 3500 వేతనాలు పెంచడం ఎంతో ఆనందదాయకంగా ఉందని వారు పేర్కొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page