top of page

ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయించాలి -సీఐటీయూ

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 2, 2023
  • 1 min read

ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయించాలి -సీఐటీయూ

తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


వీఆర్ఏలకు ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి చిట్వేలి రవికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సిఐటియు నాయకులు గురువారం తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా రవికుమార్ మాట్లాడుతూ విఆర్ఏ లకు చాలా మందికి స్మార్ట్ ఫోన్ లు లేవని, కొందరికి వాటి వినియోగం తెలియదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని వీఆర్ఏలకు నెట్ వర్క్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాబట్టి వారికి ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వి ఆర్ ఏ లు నరసింహులు, శివయ్య, బుద్దెన్ సాహెబ్, వెంకటరమణ, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page