top of page

ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 28, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఆలయాలలో నేడు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలై ఘనంగా ప్రారంభం అయ్యాయి, కమిటీ సభ్యులు ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తీర్చిదిద్దగా, దేవస్థాన పురోహితులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులకు కనువిందు చేసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్దలతో జరుపగా, దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయాలకు చేరుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలతో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయాలలో సాయంత్రం తొట్టి మెరువని గ్రామోత్సవం తో పాటు జ్యోతులు కార్యక్రమం జరపనున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page