top of page

పారిశుద్ధ్యంపై వెంటనే స్పందించిన ఆలమూరు మండల పరిషత్ అధికారులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 12, 2022
  • 1 min read

తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు మండలం, చొప్పెల్ల ఇందిరా కాలనీలో సిమెంటు రోడ్డు పై చెత్తను, పేరుకుపోయిన పారిశుద్ధ్య మును, పారిశుద్ధ్యం సిబ్బంది చేత వెంటనే తొలగించిన పంచాయితీ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్యం పూర్తిస్థాయిలో శుభ్రం చేయించారు, బ్లీచింగ్ పౌడర్ను ఫినాయిల్ తో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమస్య పై వెంటనే స్పందించిన అధికారులకు, మరియు స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వారికి, గ్రామ, మండల ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కాలనీవాసులు తెలియజేశారు. చొప్పెల్ల ఇందిరా కాలనీ ప్రజలు అంతా ఆలమూరు మండల పరిషత్ మండల అధ్యక్షులు తోరాటి లక్ష్మణరావు, జడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి- రాంబాబు , చొప్పెల్ల గ్రామ సర్పంచ్ దంగేటి చంద్రకళ- బాపనయ్య, ఆలమూరు మండలం ఎంపీడీవో, ఈపీ ఆర్టీవో పంచాయతీ అధికారి, చొప్పెల్ల గ్రామ సెక్రటరీ పనితీరుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే అధికారులు ముందు జాగ్రత్తతో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా గ్రామ మాజీ నాయకులు,రాయుడు లక్ష్మణరావు, అధికారులకు, సిబ్బందికి, నాయకులకు, ప్రముఖ ప్రజా ప్రతినిధి చిర్ల జగ్గిరెడ్డి వారికి, ఆలమూరు జడ్పిటిసి తొరాటి సీతామహాలక్ష్మి రాంబాబుకు,ఆలమూరు మండల పరిషత్ మండల అధ్యక్షులు తోరాటి లక్ష్మణరావుకు, చొప్పెల్ల గ్రామ సర్పంచ్ దంగేటి చంద్రకళ బాపనయ్య వారికి, అధికారులు వారి అందరికీ, ఇందిరా కాలనీవాసులు తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page