top of page

చిట్వేలు ఎస్ఐ, సిబ్బందిని సత్కరించిన చౌడవరం కుటుంబం,గ్రామ యువత.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 13, 2022
  • 1 min read

ఎస్సై వెంకటేశ్వర్లును,సిబ్బందిని సత్కరించిన చౌడవరం కుటుంబం,యువత.


---జాతర శాంతిభద్రతలపై ప్రశంశలు.

--ఫ్రెండ్లీ పోలీస్ గా విధులు నిర్వహించడమే మా ద్వేయమన్న ఎస్ ఐ వెంకటేశ్వర్లు.



నిన్నటి రోజున చిట్వేలు గ్రామంలో జరిగిన శ్రీ గంగమ్మ తల్లి జాతర ఉత్సవం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలు నడుమ తమ సిబ్బందితో పరిరక్షణ కల్పించిన స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు ను, మరియు పోలీసు సిబ్బందిని అభినందిస్తూ చౌడవరం కుటుంబ సభ్యులు, బ్రాహ్మణ వీది యువత ఈ రోజున మండల పోలీస్ వారందరినీ గంగమ్మ జాతర జరిగినచోట శాలువాలతో కప్పి పూలమాలలతో సత్కరించారు.



ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాంతి భద్రతలకు సహకరించిన నాయకులకు,ప్రతి నిధులకు గ్రామ పెద్దలకు, యువతకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.



ఈ కార్యక్రమంలో చిట్వేలు గ్రామ ఉప సర్పంచ్ ఉమా మహేశ్వర్ రెడ్డి, చౌడవరం సురేంద్రబాబు, మురళి, జాతర పెద్ద పగడాల నరసింహులు,తొంబరపు సుబ్బరాయుడు, నాయిని గోపాల్,బండారు గుండయ్య,గణేష్,వెంకటేష్,ఎంపీటీసీ శ్రీనివాసులు రెడ్డి , కొనిశెట్టి సుబ్బరాయుడు, హజరత్ రెడ్డి,సురేష్, శ్రీను, మరియు గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page