top of page

బదిలీపై వెళ్తున్న చిట్వేలు గ్రామ కార్యదర్శి కి.. ఉమామహేశ్వర్ రెడ్డి సన్మానం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 11, 2022
  • 1 min read

చిట్వేల్ గ్రామపంచాయతీ కార్యదర్శి మహేంద్రనాథ్ రెడ్డి బదిలీ.


---సన్మానించిన ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి,పంచాయతీ సిబ్బంది.



అన్నమయ్య జిల్లా చిట్వేలి గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేంద్రనాథరెడ్డి సాధారణ బదిలీలలో భాగంగా దువ్వూరు మండలం ఇడమడక గ్రామపంచాయతీకి బదిలీ కావడంతో... ఈరోజు ఉదయం చిట్వేలు గ్రామ ఉపసర్పంచి చౌడవరం ఉమామహేశ్వరరెడ్డి అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యదర్శి మహేందర్ నాథ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విధులలో బదిలీ అనేది సాధారణ ప్రక్రియ అని; కార్యదర్శి మహేంద్ర నాథ్ రెడ్డి గ్రామపంచాయతీకి అందించిన సేవలను కొనియాడుతూ.. తాను మరెన్నో ఉన్నత అధికార పదవులు అలంకరించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో సి కందులవారిపల్లి మాజీ సర్పంచ్ రామాంజనేయుల నాయుడు, పంచాయతీరాజ్ ఏ ఈ ఆంజనేయ ప్రసాద్, గ్రామపంచాయతీ సిబ్బంది నరసింహ, వెంకటేష్, శివ కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page