top of page

ఎమ్మార్వో సత్యానందం ను సన్మానించిన మండల రేషన్ డీలర్లు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 20, 2022
  • 1 min read

నూతన ఎమ్మార్వో ను సన్మానించిన రేషన్ డీలర్లు.

--తమకు అందే బస్తాలు సరైన తూకం లేదంటూ విన్నపం.

--డీలర్ల గడువు పొడిగించాలంటూ వినతి.



అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం రేషన్ డీలర్ల అసోసియేషన్ సంఘం సభ్యులు చిట్వేలి మండల నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు తీసుకొన్న వైయస్ సత్యానందం ను ఈ రోజున రెవిన్యూ కార్యాలయం లో సన్మానించారు.


ఈ సమావేశంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెల్లారు. ముఖ్యంగా గోడం నుంచి బియ్యం బస్తాలు సరైన తూకం లేకపోవడంతో డీలర్లు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారని, M D U ఆపరేటర్లకు, డీలర్లకు మధ్య తూకం తరుగుదల సమస్య డీలర్లకు తీవ్ర భారంగా మారిందని పేర్కొంటూ రేషన్ డీలర్ల ఆథరైజేషన్ గడువు ముగిసిన డీలర్లకు రెన్యువల్ చేయించేలాని ఎమ్మార్వోకి విన్నవించారు.


ఈ సమావేశంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, చిట్వేలు మండలం రేషన్ డీలర్ల అధ్యక్షుడు డి. శివ ప్రసాద్ యాదవ్, ఉపాధ్యక్షులు కోటేశ్వర నాయుడు, సెక్రెటరీ రసూల్ సాబ్, కోశాదికారి శ్రీనివాసులు, జనరల్ సెక్రటరీ రామకృష్ణ,కార్యనిర్వాహక కార్యదర్శి ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page