ప్రజా హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాం.మండల నూతన కమిటీ సభ్యులు.
- DORA SWAMY

- Jun 3, 2022
- 1 min read
మానవ హక్కుల పరిరక్షణ మండలం నూతన కమిటీ ఎన్నిక.

ఈ రోజున జాతీయ మానవహక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు పులి వెంకటేష్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు మండలం మరియు చిట్వేలి మండలాలకు సంబందించిన నూతన కమిటీని ఎన్నుకోవడం మరియు నియమించడం జరిగింది. సభ్యులకు సంబంధించి చిట్వేలి మండల అధ్యక్షులుగా సి .చక్రవర్తుల వరుణ్ కుమార్ రాజు,ఉపాధ్యక్షులు జనార్ధన్ , సెక్రెటరీ ఎ. రాము, జాయింట్ సెక్రెటరీ శంకర్ ను ఎన్నుకోవడం జరిగింది.
పులి వెంకటేష్ మాట్లాడుతూ ఈ సంస్థలో ఉన్న మనం స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలని,మానవ హక్కులను ప్రజలకు వివరించాలని,ప్రజలకు ఏసమస్య తో వచ్చినా మనం ముందుండి నడిపించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడటమే మానవ హక్కుల ప్రతినిధుల కర్తవ్యమని అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో చిట్వేలి మండల మానవ హక్కుల పరిరక్షణ నూతన కమిటీ పాల్గొనడం జరిగింది.



Comments