కోరం లేక మండల సర్వసభ్య సమావేశం 13 తేదీకి వాయిదా.
- DORA SWAMY

- Jun 10, 2022
- 1 min read
కోరం లేక నిలిచిన మండలసర్వసభ్య సమావేశం.
అధికారుల సమాచార చేరవేత లో జాప్యమా..?
లేక ప్రజాప్రతినిధుల అలసత్వమా..?

మండల పరిధిలోని అన్ని గ్రామాల సమస్యలను వినిపించే వేదిక మండల సర్వసభ్య సమావేశం. ఈ సమావేశం జరగడానికి ప్రజాప్రతినిధుల కనీస హాజరు తప్పనిసరి దీనినే కోరం అంటారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో ఎంపీడీవో కార్యాలయం నందు ఈరోజు ఉదయం 10 గంటలకు జరగవలసిన మండల సర్వసభ్య సమావేశం కనీస సభ్యుల
కోరం లేకపోవడంతో వాయిదా పడడం గమనార్హం.
ఎందుకు ఈ తీరు: ప్రజా ప్రతినిధులు మా సమస్యలు ఎటు తీరలేదు కదా..?? ఎందుకు హాజరవ్వాలి..?? అన్నట్లు వ్యవహరిస్తున్నారా!! లేక తమ వ్యక్తిగత అవసరాల దృష్ట్యా విస్మరిస్తున్నారా..?? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సభా వేదిక లో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేయాల్సిన ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడం ఒకింత వారిపై వ్యతిరేకత ధోరణికి దోహదం చేస్తుంది అనడంలో సందేహం లేదు.
ఎంపీడీవో సమతా వివరణ: ఈరోజు జరగాల్సిన సర్వసభ్య సమావేశం కోరం లేకపోవడం తో 13/6/2022 సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తున్నట్లు.. తప్పక ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరుకావాలని ఆమె తెలియజేశారు.



Comments