top of page

చిట్వేలి-కోడూరు రోడ్డుకు నిధులు మంజూరు. చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Nov 27, 2023
  • 1 min read

చిట్వేలి-రైల్వేకోడూరు డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు.

-35.30 కోట్లతో జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

--- వెంటనే ప్రారంభం కానున్న రోడ్డు పనులు.

---మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.


చిట్వేలి-రైల్వేకోడూరు డబుల్ రోడ్డు విస్తరణకు 35.30 కోట్ల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసినట్లు వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.సోమవారం పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారిన ఈ రోడ్డు దుస్థితి మారలేదన్నారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోడ్డుకు మహర్దశ పట్టిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రజల కల సీఎం జగన్ తో సాకారం అయిందన్నారు. మండల ప్రజల ఆకాంక్ష తీరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.నిధులు మంజూరుచేస్తూ జీవో విడుదలచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కృషిచేసిన ఎంపీ.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు లకు చెవ్వు శ్రీనివాసులు రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page