top of page

జగన్ ఆహ్వానం మేరకు సినీ పెద్దగా చిరుతో చెర్చలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 13, 2022
  • 1 min read

తాను సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించను అంటూనే మెగా స్టార్ చిరంజీవి నేడు ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవటానికి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు, ఇక్కడి నుండి తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు, మరి కొద్దీ నిమిషాల్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకోనుండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తో మధ్యాహ్నం లంచ్ మీటింగ్ లో పాల్గొననున్నారని తెలిసింది, అయితే సీఎం జగన్ ఆహ్వానం మేరకే తాను సినీ పరిశ్రమ పెద్ద వచ్చానని తెలిపారు మెగా స్టార్, రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది, కొద్దీ రోజుల క్రితం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మంత్రి పేర్ని నాని ని కలిసి టిక్కెట్ల విషయమై చర్చించిన విషయం తెలిసిందే, ఇదే కోవలో నేడు చిరంజీవి సీఎం జగన్ ని కలవటం అటు రాజకీయంగానూ ఇటు సినీ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకొంది.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page