top of page

ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి బాలిక లేఖ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 2, 2022
  • 1 min read

ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి బాలిక లేఖ

పెన్సిల్‌ కూడా కొనలేకపోతున్నా…

కనీసం పెన్సిల్‌, రబ్బర్‌ కూడా కొనలేకపోతున్నానని, అవి ఖరీదై పోయాయంటూ ఒకటవ తరగతి చదువుతున్న బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆ చిన్నారి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా చిబ్రమావుకు చెందిన ఆరేళ్ల కీర్తి దూబే 1వ తరగతి చదువుతున్నది. ఆమె పెన్సిల్‌, రబ్బర్‌ను క్లాస్‌లో చోరీ చేస్తున్నారు. దీంతో కొత్త పెన్సిల్‌ కొనమని తల్లిని అడుగుతుండగా ఆమె మందలిస్తుంది. ఇది పరిపాటిగా మారింది.

కాగా, ఆదివారం ఆ చిన్నారీ, మ్యాగీ ప్యాకెట్‌ కొనేందుకు ఐదు రుపాయలతో షాప్‌కు వెళ్లింది. అయితే మ్యాగీ ప్యాకెట్‌ ధర ఏడు రూపాయలు పెరిగినట్లు షాప్‌ వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ పాప నిరాశతో ఇంటికి తిరిగి వచ్చింది. కొత్త పెన్సిల్‌ కోసం మరోసారి మారం చేయగా తల్లి మందలించింది. టేబుల్స్‌ రాయమని చెబుతుంది.

అయితే ఆ బాలిక ధరల పెరుగుదలపై ప్రధాని మోదీకి లేఖ రాసింది. ‘ప్రధానమంత్రీ జీ.. నా పేరు కీర్తి దూబే. నేను 1వ తరగతి చదువుతున్నాను. మీరు ధరలు విపరీతంగా పెంచారు. నా పెన్సిల్, ఎరేజర్ కూడా ఖరీదయ్యాయి. మ్యాగీ ధర కూడా పెరిగింది. నేను పెన్సిల్ అడిగితే మా అమ్మ కొట్టింది. నేను ఏమి చేయాలి? ఇతర విద్యార్థులు నా పెన్సిల్‌ను దొంగిలించారు’ అని హిందీలో రాసింది. మరోవైపు న్యాయవాది అయిన బాలిక తండ్రి విశాల్ దూబే, ధరల పెరుగుదలపై పాప ఆవేదనను అర్థం చేసుకున్నారు. ప్రధాని మోదీకి తన కుమార్తె రాసిన లేఖను ప్రధాని కార్యాలయానికి సోమవారం రిజిస్టర్‌ పోస్ట్ చేశారు. దీంతో ఈ లేఖ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కాగా, ధరల పెరుగుదలపై విపక్షాలు పార్లమెంట్‌లో గళమెత్తుతున్న తరుణంలో ప్రధాని మెదీకి ఆ చిన్నారి ఈ మేరకు లేఖ రాయడం విశేషం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page