top of page

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: చెవ్వు శ్రీనివాసులు రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 14, 2022
  • 1 min read

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: చెవ్వు శ్రీనివాసులు రెడ్డి

బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం చిట్వేలు అంబేద్కర్ సర్కిల్ వద్ద వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు, ప్రదీప్ రెడ్డి, లింగం లక్ష్మీకర్,ఎంపిటిసిలు, సర్పంచులు కార్యకర్తలతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అవమానించ బడిన చోటనే గౌరవించడం ఆయన పట్టుదలకు నిదర్శనమని బడుగు బలహీన వర్గాల అసమానతలను రూపుమాపడంలో తాను చేసిన కృషి గర్వించదగినదని అంతటి మహా పురుషులు మనదేశంలో జన్మించడం మనం చేసుకున్న అదృష్టమని విశ్వం ఉన్నంత వరకు వారి కీర్తి అజారామం అని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో సర్పంచి ఈశ్వరయ్య, సుధా, హరి, రవికుమార్, ప్రకాష్, జనార్ధన, హజరత్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page