top of page

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 19, 2022
  • 1 min read

కడప జిల్లా, పులివెందుల పట్టణం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజు జయంతి సందర్భంగా హిందు ఐక్యవేదిక నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి, పూల అంగళ్ల సర్కిల్లో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ భారత వీరత్వానికి ప్రతిగా భారత జాతి సగర్వంగా చెప్పుకునే దీరుడు, మొగల్ సామ్రాజ్యాన్ని పతనాన్ని శాసించి, హిందూ సామ్రాజ్యాపు వెలుగును అఖండ భారతావనిలో విస్తరింపజేసిన యోధుడని, యువతరానికి ఎప్పటికీ పౌరుషాగ్ని రగిలించే దిక్సూచి, కత్తి పట్టిన శంకరుడు అని అతని వీరగాథలు గుర్తు చేసుకుంటూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు పులివెందుల ప్రజలకు తెలియజేశారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page