top of page

నేడు ఒంగోలు రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 26, 2022
  • 1 min read

నేడు ఒంగోలు రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఒంగోలుకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దు అయిన మార్టూరు ప్రాంతం నుంచి ఒంగోలు వరకు గురువారం చంద్రబాబుకు జిల్లా నేతలు నూకసాని బాలాజీ, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్ తదితరులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు లోని హోటల్ సరోవర్ లో పొలిట్‌బ్యూరో సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు.


మహానాడులో చర్చించే కీలక అంశాలపై పొలిట్‌బ్యూరోలో చర్చించనున్నారు. మహానాడు జరిగే రెండురోజులూ ఇతర ముఖ్యనేతలతో కలిసి ఆ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page