top of page

గిరిజన కాలనీలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 20, 2022
  • 1 min read

గిరిజన కాలనీలో ఘనంగా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు - పెద్ద ఎత్తున పాల్గొన్న టీడీపీ శ్రేణులు.

ఈరోజు అమరావతి సృష్టికర్త, భావితరాల స్ఫూర్తి ప్రదాత, టిడిపి జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదినోత్సవాన్ని బుధవారం మండల పరిధిలోని కస్తూరివారి పల్లి గిరిజన కాలనీలో గిరిజన చిన్నారులు, మహిళలతో కలిసి టిడిపి మండల అధ్యక్షులు మరియు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు కె కె చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కె కె చౌదరి మాట్లాడుతూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలావలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నా, ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి జరిగి మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలన్నా, ఇలాంటి మారుమలల్లో వున్న గిరిజన, హరిజన, బి.సి కాలనీల్లో గ్రామాలకు తారు మరియు సిమెంట్ రోడ్లు రావాలన్నా చంద్రబాబునాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు.


ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అన్నిరకాల ధరల పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ ఇబ్బందులు తొలగి ప్రజలు సౌకర్యవంతమైన జీవనం కొనసాగించాలంటే రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతైనా ఉందన్నారు.


కాబట్టి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు.


ఈ కార్యక్రమంలో మండల బి.సి సెల్ అధ్యక్షుడు వలసాని గుండాలయ్య యాదవ్, తెలుగుయువత పార్లమెంట్ అధికార ప్రతినిధి బాలకృష్ణ యాదవ్, దళిత నాయకులు దనాసి నాగేంద్ర, ఏర్రతోట సురేష్, కువైట్ ఎన్టీఆర్ సేవాదళ్ అధ్యక్షులు కోటేశ్వర నాయుడు, కస్తూరి శివ మరియు గిరిజన మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page