top of page

నేడు కుప్పం వెళ్లనున్న చంద్రబాబు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2022
  • 1 min read

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లనున్నారు. మూడు రోజులపాటు అక్కడే పర్యటించనున్నారు. వివిధ స్థాయిల్లోని కేడర్‌తో సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు.

గతేడాది కుప్పం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సందర్భంగా సంభవించిన పరిణామాల నేపథ్యంలో. కొత్త ఏడాది ప్రారంభంలోనే చంద్రబాబు సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. వైసీపీ అరాచకాలు, కార్యకర్తలపై దాడులను ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రికి కుప్పం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లోనే బస చేయనున్నారు చంద్రబాబు. రేపు కుప్పం మండలంలోను, ఎల్లుండి రామకుప్పం మండలంలోనూ పర్యటన కొనసాగుతుంది. అధినేత రాక సందర్భంగా ఇప్పటికే తెలుగుదేశం నేతలు ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఆయనకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page