top of page

ఆర్.శ్రీనివాసుల రెడ్డి అరెస్టు అక్రమం - టిడిపి నేత చమర్తి జగన్ రాజు

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 8, 2023
  • 1 min read

ఆర్.శ్రీనివాసుల రెడ్డి అరెస్టు అక్రమం - టిడిపి నేత చమర్తి జగన్ రాజు

సమావేశంలో మాట్లాడుతున్న చమర్తి జగన్మోహన్ రాజు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి ని అరెస్టు చేయడం అక్రమమని., ఆయన అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి సీనియర్ నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ డి.డి డాక్టర్ అచ్చన్న హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ అఖిలపక్షం కడప పట్టణ ర్యాలీలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజంపేట టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు ఆర్.శ్రీనివాసులు రెడ్డిని అడ్డుకొని అక్రమ అరెస్టు చేయడం పిరికిపంధ చర్య అని అన్నారు.

డాక్టర్ అచ్చన్న మృతి పై పలు అనుమానాలు ఉన్నాయని, పథకం ప్రకారం హత్య చేశారని, ఇది ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తూ పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధిత డాక్టర్ అచ్చన్న కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమిస్తే అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా జగన్ రాజు డిమాండ్ చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page