top of page

కాలే కడుపుల ఆకలి తీర్చిన చల్లా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 24, 2022
  • 1 min read

కాలే కడుపుల ఆకలి తీర్చిన చల్లా

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


స్థానిక మైదుకూరు రోడ్డులోని అన్వర్ సినిమా హాలు దగ్గర ప్రతి శనివారం సీమాంధ్ర బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శ్రీకృష్ణ ఆలయ కమిటీ చైర్మన్ చల్లా రాజగోపాల్ యాదవ్ చేపట్టే అన్నదాన కార్యక్రమం శనివారం మధ్యాహ్నం ప్రారంభం కాగా, విశేషంగా అధిక సంఖ్యలో ప్రజలు అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా చల్లా రాజగోపాల్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజలకు తన వంతు సేవ సహాయ కార్యక్రమాలలో భాగంగా, ప్రతి శనివారం తాను తలపెట్టి నిర్వహిస్తున్న అన్న ప్రసాద కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, ప్రజల ఆశీస్సులు, దీవెనలు తనపై ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు, చెల్లా అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page