top of page

సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 1, 2022
  • 1 min read

సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

కడప జిల్లా, ప్రొద్దుటూరు


శనివారం మధ్యాహ్నం స్థానిక మైదుకూరు రోడ్డు అన్వర్ థియేటర్ సమీపంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు అయిదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజగోపాల్ యాదవ్ మాట్లాడుతూ గత ఆరు నెలలుగా తాము తమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రజల క్షుధాబాధ తీర్చటానికై తాము ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని, కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా తాము చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్విరామంగా నిర్వహిస్తున్నామని, పేద ప్రజల ఆకలి తీర్చటంలోనే తాను సంతోశాన్ని పొందుతున్నానని. రాబోవు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ నాయకులు, పలువురు సేవాతత్పరులు, ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page