top of page

ఎమ్యెల్యేని ప్రశ్నించిన రైతుపై 307 సెక్షన్ కింద కేసు నమోదు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 8, 2022
  • 1 min read

ఎమ్యెల్యే ని ప్రశ్నించిన రైతుపై పోలీస్ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. ఇటీవల వేల్పూరు లో ఎమ్యెల్యే,ఎంపీ సమక్షంలో రైతుల ధాన్యం అధికారులు కొనడం లేదని రైతు నరేంద్ర ప్రశ్నించడంతో ఎమ్యెల్యే రైతుపై చెప్పుతో కొడతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నరేంద్ర కూడా ఎమ్యెల్యే కు ఎదురుతిరిగి మాట్లాడాడు. అనంతరం నరేంద్రను ఎమ్యెల్యే పోలీస్ లు ద్వారా అరెస్ట్ చేపించారు. ఇదంతా ఎంపీ సమక్షంలో జరిగింది. అయితే ఈ రోజు ఎమ్యెల్యే పిఎ అంజి తనను నరేంద్ర చంపబోయాడు అంటూ కేస్ పెట్టడంతో నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేసి 307 కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page