top of page

పవన్‌కళ్యాణ్ పై కేసు నమోదు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 12, 2022
  • 1 min read

పవన్‌కళ్యాణ్ పై కేసు బుక్కయ్యింది


కార్ టాప్‌ ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించడంపై ఫిర్యాదు


హైవే పై ప్రమాదకరం గా ప్రయాణించిన పవన్ కళ్యాణ్, సిబ్బంది మరియు కాన్వెయ్


పవన్‌పై కేసు బుక్కయ్యింది. ఆయన కార్ టాప్‌ ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించడంపై ఫిర్యాదు అందడంతో తాడేపల్లి స్టేషన్‌ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

పవన్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇప్పుడం వెళ్లిన సమయంలో పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు పవన్. తనను ఆపే ప్రయత్నం చేయడంతో పార్టీ కార్యాలయం నుంచి కాలి నడకన ఇప్పటం వెళ్లే ప్రయత్నం చేశారు. ఆపై కారుపైకి ఎక్కి ప్రయాణించారు.


కారు వేగంగా దూసుకుపోతున్నా కూడా ఆయన కాళ్లు బారజాపుకుని అలానే కూర్చిండిపోయారు. ఇలా టాప్ పైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, హైవేపై పలు వాహనాలు పవన్ కాన్వాయ్‌ను అనుసరించడం వంటి కారణాలు చూపిస్తూ శివకుమార్ అనే వ్యక్తి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఐపీసీ 336, రెడ్ విత్ 177M కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరి దీనిపై జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
sreeni sangana
sreeni sangana
Nov 13, 2022

Down down ysrcp...anni aarachakalee nyayam anede jaragatledu state lo ...mydukur mla...worest admin ....chetta govt....

@ysjagan @YSRCParty You are not caring about formers problems created by ur MLA's&leaders but for words you are favourite CM for formers.Flase case on us by occupying our patta lands,no justice at all, ManyamRani land/Gaddamayapalli/Mydukur.Annalu,need justice please help public.

Like
bottom of page