top of page

ట్రాక్టర్ ను ఢీకొన్న కారు ఒకరు మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 22, 2022
  • 1 min read

ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ఇనోవా కారు, ఒకరు మృతి, మరో ముగ్గురికి గాయాలు.

మర్రిపాడు మండలం డిసిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామనాయుడు పల్లి నుండి పొగాకునారు లోడు తో డిసిపల్లి వైపు వెళుతున్న ట్రాక్టర్ను వెనుక నుండి వేగంగా ఓ వినోవా కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న డాక్టర్ దిలీప్ కుమార్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు డాక్టర్లకు గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు నారాయణ హాస్పిటల్ కు చెందిన వైద్యులుగా గుర్తించడమైనది. కడప జిల్లా జమ్మలమడుగులో మెడికల్ క్యాంపు చూసుకొని తిరిగి నెల్లూరుకి వెళ్తుండగా మార్గ మధ్యలో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page