top of page

ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 6, 2022
  • 1 min read

ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీటెక్ రవి

ఆదివారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ బీటెక్ రవి, అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఉండగా ఎమ్మెల్యేనే డ్వాక్రా మహిళలను ఇంటి మీదకు ఉసికొల్పారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్రవీణ్ రెడ్డి సతీమణి మౌనికా రెడ్డి జిల్లా ఎస్పీని కలిసి సీడీ ఫైల్ ఆలస్యం చేయకుండా పంపించమని కోరారని అన్నారు. భారతదేశంలో  ఏ రాజకీయ పార్టీ, న్యాయస్థానాలను కానీ, వ్యవస్థలను కానీ ప్రభావితం చెయ్యవు అని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న మాటలను గుర్తు చేస్తూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్, ఇక్కడ రాచమల్లు  డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారని, ఎమ్మెల్యే దయా దాక్షిణ్యాలు తమకు వద్దని ప్రవీణ్ రెడ్డిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజమెత్తారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page