top of page

కొనిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 21, 2022
  • 1 min read

కొనిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్సార్సీపి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్త పంచాయతీ కార్యాలయం పరిధిలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి పంచాయతీ పరిధిలోని పలువురు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్త దానం చేయగా, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొనిరెడ్డి మాట్లాడుతూ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రక్తదాన శిబిరానికి వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page